![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1110 లో.....వసుధార, రంగా ఇద్దరు కలయిక కొబ్బరి బొండం తాగుతుంటారు. కొబ్బరి బొండంలోని విటమిన్ గురించి వసుధార చెప్తుంటే.. అవన్నీ నాకు చెప్పకు మీ రిషి సర్ అయితే ఇలాగే అనేవారు కావచ్చు కదా అంటూ.. ఇదంతా నాకు ఎందుకు చెప్తున్నావ్.. అందుకే భరించలేక మీ రిషి సర్ నిన్ను వదిలి వెళ్లిపోయారు.. అదృష్టవంతుడని రంగా అనగానే.. వసుధార ఏడుస్తుంటుంది. అయ్యో మేడమ్ గారు.. నేనేదో అన్నాను మీరెందుకు ఏడుస్తున్నారని రంగా అంటాడు. మీ రిషి సర్ అయితే ఇలాగే బుజ్జగించేవాడేమో అలా అని నన్ను రిషి సర్ అనుకోకండి అని రంగా అంటాడు. ఆ తర్వాత రంగా ఫోన్ మాట్లాడుతుంటే.. ఒకతను వచ్చి మా రంగా మీకు తెలుసా అమ్మ అంటూ అడుగుతాడు.
చాల మంచివాడు మా రంగా అని అతను అనగానే.. ఎంత కాలంగా మీ రంగా తెలుసని వసుధార అనగానే.. వాడి చిన్నప్పటి నుండి తెలుసని అతను అంటాడు. అప్పుడే రంగా వస్తాడు నీ గురించి అడుగుతుంది రా అని అతను అనగానే.. ఏంటి మేడమ్ గారు నేను రిషి సర్ ని కాదు రంగా అంటుంటే మళ్ళీ అందరిని అడుగుతున్నారా అని కోపంగా వసుధారని అక్కడే వదిలేసి రంగా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఒకావిడ వచ్చి.. ఏంటి మా రంగా ఆటో ఎక్కించుకోకుండా వెళ్తున్నాడు. మా రంగా మంచివాడు నా పాపని స్కూల్ మానిపిస్తే ఇప్పుడు తనే పాపని చదివిస్తున్నాడంటూ రంగా గురించి ఆవిడ గొప్పగా చెప్తుంది. ఆ తర్వాత వసుధార ఒక్కతే వెళ్లడం గమనించిన సరోజ రౌడీలకి వసుధారని చూపిస్తుంది. రౌడీలు వసుధార వెనకాలే వస్తుంటే వసుధార చూసి పరిగెడుతుంది. అప్పుడే రంగా ఆటో తీసుకొని వస్తాడు. వసుధారని ఎక్కించుకొని వెళ్ళిపోతాడు.
మరొకవైపు ఇక ఆ వసుధార ఇక్కడికి రాదని సరోజ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే రంగా వసుధారని తీసుకొని వస్తాడు. ఆ రౌడీలకి మేడమ్ గురించి ఎందుకు చెప్పావంటు సరోజపై రంగా కోప్పడతాడు. మరొకవైపు ఒక అమ్మాయిని పట్టుకోవడం లేదని రౌడీ తన అసిస్టెంట్లని కొడతాడు. ఈ ఆటోవాడే కాపాడాడంటూ రౌడీకి రంగా ఫోటో చూపించిగానే.మ అతను షాక్ అవుతాడు. వీడిని ఎక్కడో చూసానంటూ ఊటీలో రిషిపై ఎటాక్ చేసింది గుర్తుకుచేసుకొని వీడు బ్రతికే ఉన్నాడా అని అనుకుంటాడు. ఎవరన్న అతను అని వాళ్ళు అడుగగా.. వీడేరా ఈ కథ హీరో అని రౌడీ చెప్తాడు. మరొకవైపు వసుధార దగ్గరకి సరోజ వచ్చి.. నీ వల్ల నా బావ నన్ను తిడుతున్నాడు. ఇక్కడ నుండి వెళ్ళిపోమని సరోజ అనగానే.. పదిహేను రోజుల్లో నువ్వు అనుకుంటున్న రంగాతోనే.. ఈవిడే నా భార్య అని చెప్పిస్తాను.. అప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిపోతామని సరోజకి వసుధార ఛాలెంజ్ విసురుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |